Kannappa: కన్నప్ప రెండో టీజర్ విడుదల...! 1 y ago
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'కన్నప్ప'. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్లాల్ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మోహన్ బాబు నిర్మాత. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోన్న ఈచిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈనేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా టీజర్ 2 విడుదల చేసింది. తిన్నడు పాత్రలో విష్ణు నటన ఆకట్టుకునేలా ఉంది. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీ దేవిగా కాజల్ కనిపించారు. టీజర్ చివర్లో రుద్రగా ప్రభాస్ కనిపించి అలరించారు.